calender_icon.png 3 December, 2025 | 1:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అసాధారణ ప్రేమికుడు మోగ్లీ

03-12-2025 12:41:56 AM

యంగ్ హీరో రోషన్ కనకాల తన రెండో చిత్రం ‘మోగ్లీ 2025’. సందీప్‌రాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. డిసెంబర్ 12న విడుదల కానున్న ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న మంగళవారం లాంచ్ చేశారు. చెవిటి-మూగ హీరోయిన్, అసాధారణ కథానాయకుడు, రామాయణ శైలి కథనం ఈ చిత్రానికి ప్రత్యేకతను జోడించింది.

రోషన్ కనకాల మోగ్లీ పాత్రలో అదరగొట్టాడు. సాక్షి మడోల్కర్ సవాలుతో కూడిన పాత్రను పోషించారు. బండి సరోజ్ కుమార్ విలన్‌గా కనిపించారు. ఈ చిత్రానికి సంగీతం: కాలభైరవ; డీవోపీ: రామమారుతి ఎం; యాక్షన్: నటరాజ్ మాడిగొండ; ఎడిటర్: కోదాటి పవన్‌కల్యాణ్; ఆర్ట్: కిరణ్ మామిడి.