calender_icon.png 3 December, 2025 | 1:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజాసాబ్ రన్‌టైమ్ 3.14 గంటలు!

03-12-2025 12:43:08 AM

ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న చిత్రం ‘రాజాసాబ్’. తాజాగా ఈ సినిమాకు అమెరికాలో బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. భారీ రన్‌టైమ్‌తో విడుదల చేస్తున్నారు. టికెట్ బుకింగ్ వెబ్‌సైట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం ఈ సినిమా రన్‌టైమ్ 3 గంటల 14 నిమిషాల నిడివితో ఉండనుంది. ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా 2026, జనవరి 9న విడుదల కానుంది. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ కథానాయికలు.

సంజయ్‌దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. బొమన్ ఇరానీ ముఖ్యపాత్రలో కనిపించనున్నారు. మంగళ వారం ఆయన పుట్టినరోజు సందర్భంగా బొమన్ పాత్రను పరిచయం చేస్తూ మూవీ టీమ్ ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. సైకియాట్రిస్ట్, హిప్నాటిస్ట్, పారానార్మల్ ఇన్వెస్టిగేటర్‌గా బొమన్ ఇరానీ క్యారెక్టర్ ప్రేక్షకులను థ్రిల్ చేయనుందని పేర్కొన్నారు. ఈ చిత్రా నికి సంగీతం: తమన్; డీవోపీ: కార్తీక్ పళని; ఎడిటర్: కోటగిరి వేంకటేశ్వరరావు; ప్రొడక్షన్ డిజైన్: రాజీవన్.