calender_icon.png 3 December, 2025 | 1:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగారుపెట్టే అనుమాన పక్షి

03-12-2025 12:40:53 AM

రచయితగా, -దర్శకుడిగా తొలిచిత్రం ‘డీజే టిల్లు’తోనే బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్నారు విమల్ కృష్ణ. ఇప్పుడాయన యువ నటుడు రాగ్ మయూర్‌ను హీరో గా పెట్టి ఓ సినిమా చేస్తున్నారు. అదే ‘అనుమాన పక్షి’. రాజీవ్ చిలకా, రాజేశ్ జగ్తియాని, హీరాచంద్ దండ్ నిర్మిస్తున్నారు. మెరిన్ ఫిలిప్ హీరో యిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ కథానాయకుడు రాగ్ మయూర్ పాత్ర ప్రోమోను విడుదల చేశారు.

రాగ్‌మయూర్ అతిగా ఆలోచిస్తూ, అతి జాగ్రత్త స్వభావంతో చుట్టూ ఉన్నవారిని గందరగోళపరిచే విచిత్రమైన క్యారెక్టర్‌లో ఆకట్టుకోనున్నారు. ఫిబ్రవరిలో రాను న్న ఈ సినిమా స్పష్టమైన విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రీచరణ్ పాకాల; డీవోపీ: సునీల్‌కుమార్ నామా; ఆర్ట్: జేకే మూర్తి; ఎడిటర్: అభినవ్ కునపరెడ్డి.