13 April, 2026 | 4:51 AM

కమ్యూనిటీహాల్‌ను ప్రారంభించిన ఎంపీ, ఎమ్మెల్యే

13-04-2026 02:43 AM

మేడ్చల్, ఏప్రిల్ 12(విజయక్రాంతి): మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని జీడిమెట్ల డివిజన్ రాఘవేంద్ర నగర్ కాలనీలో కమ్యూనిటీ హాల్ ను స్థానిక ఎమ్మెల్యే కెపి వివేకానంద తో కలిసి ఎంపి ఈటల రాజేందర్ ప్రారంభించారు. ఎంపీ, ఎమ్మెల్యే నిధులతో కమ్యూనిటీ హాల్ ను నిర్మించారు.

ఈ సందర్భంగా ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఇచ్చిన నిధులతో పాటు మరికొన్ని జమ చేసుకొని అద్భుతంగా నిర్మించుకోవడం అభినందనీయమని అన్నారు. కాలనీల ప్రజలు ఐక్యంగా ఉంటే ఇలాంటి అభివృద్ధి పనులు చేసుకోవడానికి సాధ్యమవుతుందన్నారు. అన్ని పనులను ప్రభుత్వాలు చేసే వీలుండదని, కొన్ని సందర్భాల్లో కాలనీలా అసోసియేషన్, గేటెడ్ కమ్యూనిటీ అసోసియేషన్ లు తమ వంతు సహకారం అందించాలన్నారు.

ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎస్ మల్లారెడ్డి, ప్రధాన కార్యదర్శి గిరి వర్ధన్ రెడ్డి, కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చింతల మాణిక్ రెడ్డి, జీడిమెట్ల డివిజన్ ఈ కార్పొరేటర్ చెరుకుపల్లి తారాచంద్రారెడ్డి, గోపురమణారెడ్డి, వడ్డేపల్లి రాజేశ్వరరావు, పింగళి వెంకట్ రెడ్డి, కట్ట కుమార్, రాఘవేంద్ర కాలనీ అధ్యక్షుడు బివి నారాయణ, ప్రధాన కార్యదర్శి ఉమాపతిరావు, ఉపాధ్యక్షుడు బి సతీష్ కుమార్, కార్యదర్శి కోటేశ్వరరావు, కోశాధికారి శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు పీవీ శ్రీనివాస్, కె ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు.