19-02-2026 03:37:24 PM
హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ మద్దతు ఇచ్చిందని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్(BJP MP Dharmapuri Arvind) అన్నారు. కేసుల మాఫీ కోసమే కాంగ్రెస్ కు బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందని ఆరోపించారు. గతంలో కేసీఆర్ అవినీతిని ఎవరూ ప్రశ్నించవద్దని ఎమ్మెల్యేలను కొన్నారని అర్వింద్ వెల్లడించారు. కేసీఆర్ వ్యవస్థను నాశనం చేశారు.. రేవంత్ రెడ్డి ఇప్పుడు కొనసాగిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
ఎవరు ఎవరి వల్ల భూస్థాపితం అయ్యారో కవితకు తెలియదా? అని ఎంపీ అర్వింద్ ప్రశ్నించారు. 20 ఏళ్ల నుంచి పార్టీని పట్టిపీడిస్తున్న కోవర్టులు వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. మెట్ పల్లిలో కోవర్టు వెళ్లిపోయారు.. పార్టీకి పట్టిన పీడ పోయిందని చెప్పారు. కరీంనగర్ ను నిజామాబాద్ తో పోల్చలేమని అర్వింద్ తెలిపారు. నిజామాబాద్ లో ముస్లింలు ఎక్కువగా ఉన్నారని పేర్కొన్నారు. ఎంపీ అర్వింద్, రామచందర్ రావు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి పురస్కరించుకుని రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో వారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, ఘన నివాళులు అర్పించారు.