15 April, 2026 | 12:56 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

వైద్య సిబ్బందిపై వేధింపులు.. నిధులు దుర్వినియోగంపై సమగ్ర విచారణ జరపాలి

14-06-2025 04:37 PM

సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు రణపంగ కృష్ణ..

పెన్ పహాడ్: ప్రజా వైద్య సిబ్బంది (ఏఎన్ఎం) లపై చేస్తున్న వేధింపులు.. సామాజిక ఆరోగ్య సేవల అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించిన (ఎన్ఎచ్ఎం) నిధులను తమ స్వంత ఖాతాకు మళ్ళించుకుని అక్రమాలకు పాల్పడిన నిందితులు డాక్టర్ స్రవంతి, హెచ్ఈఓ చంద్రశేఖర్ రాజుపై చట్టరి చర్యలు తీసుకుంటూ ఆర్ఆర్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేయాలని సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు రణపంగ కృష్ణ(CITU District Committee Member Ranapanga Krishna) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

శనివారం సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండల కేంద్రంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ప్రజా వైద్యశాలలో ఎలాంటి తీర్మానాలు లేకుండా ఎంటి చెక్కులు తీసుకొని సొంత ఖాతాలోకి వేయించుకోవడం ప్రజా ధనాన్ని లక్షల్లో స్వాహా చేస్తున్న అధికారులపై సమగ్ర విచారణ జరపాలని.. నిందితులను చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజా వైద్యం అందించాల్సిన అధికారులు ప్రజల సొమ్మును దుర్వినియోగం చేయడం దుర్మార్గమైన చర్యన్నారు. పల్లెల్లో నిత్యం ప్రజల ఆరోగ్య సమస్యల పైన నిరంతరం పర్యటిస్తూ ప్రజల ఆరోగ్యాలు కాపాడుతున్న ఏఎన్ఎంల సేవలను మరింత మెరుగు పరిచే విదంగా వైద్యాధికారిని, ఎచ్ఈఓ సమన్వయం తో పనిచేయించు కోవాలే తప్ప వేధింపులు చేసి అక్రమంగా ప్రజా సొత్తును కాజేయడం సిగ్గు చేటన్నారు. వీరిపై కఠిన చర్యలు లేని పక్షంలో సిఐటియు, ప్రజా సంఘాల  ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు.