25 May, 2026 | 8:27 PM

స్త్రీ శక్తి భవనాలకు శంకుస్థాపన చేసిన ఎంపీడీవో, సర్పంచ్

25-05-2026 07:56 PM

కారేపల్లి,(విజయక్రాంతి): డ్వాక్రా మహిళలకు వారి సమావేశాల కొరకు  తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం మంజూరుచేసిన స్త్రీ శక్తి భవనాలను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  వర్చువల్ పద్దతి లో 8000 భవనాలకు శంకుస్థాపన చేయాగా, సింగరేణి మండలం భాగ్యనగర్ తండా లో 2 భవనాలకు  శంకుస్థాపన ను ఎంపీడీవో మల్లెల రవీంద్రప్రసాద్ సర్పంచ్ బానోత్ హీరాలాల్ ముఖ్య అతిథులుగా పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా సర్పంచ్ మాట్లాడుతు మహిళలకు అధిక ప్రాధన్యం ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వమని వారిని కోటీశ్వరులను చేయాలనే దీర్ఘకాల లక్ష్యం తో ముందుకు వెళ్తుందని, ఈ భవనలు మహిళకీ చాలా ఉపయోగకరంగా ఉండి వారి సమావేశాలకు ఉపయోగపడుతుందని అన్నారు.