కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసింది.. వీళ్లే
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మే 13వ తేదీన జరిగిన లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించింది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో భారత ప్రధానిగా వరుసగా మూడోసారి నరేంద్ర మోదీ ఆదివారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు పలువురు ఎంపీలు కేంద్ర మంత్రిమండలిలో ప్రమాణ స్వీకారం చేశారు.
72 మందితో మోడీ కేబినెట్ కొనసాగనుంది. ఇందులో 30 మంది కేబినెట్ మంత్రులు, ఐదుగురు స్వతంత్ర మంత్రులు, 36 మంది సహాయమంత్రులు, కేబినెట్‌లో 27 మంది ఓబీసీ, ఎస్సీలు 10 మంది, ఎస్టీలు 5 మంది, ఐదుగురు మైనార్టీలకు మంత్రి పదవులు, మిత్రపక్షాలకు 11 మంత్రి పదవులు కేటాయించనున్నారు.
కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసింది వీరే..
రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా, నిర్మలా సీతారామన్, జై శంకర్, మనోహర్ లాల్ ఖట్టర్, జేడీఎస్ నేత కుమారస్వామి, పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రదాస్, హిందూస్థాన్ ఆవామీ మోర్చాకు అధినేత జితన్ రాం మాంఘీ, జేడీయూకు చెందిన రాజీవ్ రంజన్ సింగ్ అలియస్ లలన్ సింగ్, అస్సాంకు చెందిన సర్భానంద సోనోవాల్, వీరేంద్ర కుమార్ (మధ్యప్రదేశ్) టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు(ఆంధ్రప్రదేశ్), బీజేపీ సీనియర్ నేత ప్రహ్లాద్ జోషి (కార్ణాటక), జుయల్ ఓరం (ఒడిశా), గిరిరాజ్ సింగ్ (బిహార్), అశ్వనీ వైష్ణవ్ (రాజస్థాన్), జ్యోతిరాదిత్య సింథియా (మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్), భూపేంద్ర యాదవ్ (రాజస్థాన్), గజేంద్రసింగ్ షెకావత్ (రాజస్థాన్), ఝార్ఖండ్ మహిళ నేత అన్నపూర్ణాదేవి, కిరణ్ రిజిజు (అరుణాచల్ ప్రదేశ్), హర్ధీప్ సింగ్ (పంజాబ్), మన్ సుఖ్ మాండవీయ (గుజరాత్), కిషన్ రెడ్డి (తెలంగాణ)
చిరాగ్ పాసవాన్ (హాజీపుర్), సీఆర్ పాటిల్, రావ్ ఇంద్రజీత్ సింగ్ (హరియాణా), జితేంద్ర సింగ్ (జమ్ము), అర్జున్ రామ్ మేఘవాల్ (రాజస్థాన్), ప్రతాప్ రావ్ గణపత్ రావు జాదవ్ (మహారాష్ట్ర), జయంత్ చౌదరి, జితిన్ ప్రసాద్, శ్రీపాద్ యశో నాయక్, పంకజ్ చౌదరి, క్రిషన్ పాల్, రాందాస్ అఠవలే ( మహారాష్ట్ర), రామ్ నాథ్ ఠాకూర్, నిత్యానంద్ రాయ్(బిహార్ లోని హాజీపుర్), అనుప్రియా పటేల్, సోమన్న(కర్ణాటక), టీడీపీ ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ (ఆంధ్రప్రదేశ్), ఎస్పీ సింగ్ బఘేల్, శోభా కరంద్లాజే, కీర్తి వర్థన్ సింగ్, యూపీ నేత బీఎల్ వర్మ, శాంతన్ ఠాకూర్, సురేశ్ గోపి(కేరళ), ఎల్ మురుగన్, అజయ్ తంప్టా, బండి సంజయ్ కుమార్ (తెలంగాణ), కమలేశ్ పాసవాన్, భగీరథ్ చౌదరి, సతీశ్ చంద్ర దూబే, సంజయ్ సేథ్, రవ్ నీత్ సింగ్, దర్గాదాస్ ఉయికె, రక్షా నిఖిల్ ఖడ్సే, సుఖాంత్ మఖుందార్, సావిత్రి ఠాకూర్, తోకన్ సాహు ప్రమాణ స్వీకారం చేశారు.






