ముగిసిన ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం.. కొనసాగుతున్న ఎంపీల ప్రమాణం
న్యూఢిల్లీ : భారత ప్రధానిగా నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రమాణస్వీకారం చేశారు. మోదీ ప్రమాణస్వీకార కార్యక్రమం రాష్ట్రపతి భవన్ లో ఘనంగా జరుగుతోంది. ఈ కార్యక్రమానికి వివి దేశాల అధినేతలతో పాటు, సార్క్ సభ్య దేశాల నేతలకు ఇప్పటికే ఆహ్వానం అందగా, ఈ కార్యక్రమానికి ఏడుగురు దేశాధినేతలు, బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్, నేపాల్, మారిషస్, షీచెల్స్ నేతలతో పాటు 8 వేల మందికి పైగా ప్రత్యేక అతిథులు, బాలీవుడ్ నటులు షారూక్ ఖాన్, అక్షయ్ కుమార్, తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్, పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ సహా పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ, వాణిజ్య ప్రముఖులు, వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు హాజరయ్యారు. మోదీతోపాటు కేబినెట్ మంత్రిగా రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డా మోదీ కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ 18 ఏళ్ల పాటు సీఎంగా సేవలందించి ఇవాళ కేబినెట్ లో చేరారు. కేంద్రమంత్రిగా నిర్మలా సీతారామన్ మరోసారి ప్రమాణ స్వీకారం చేశారు. 2019 ఎన్నికల్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా సేవలందించారు.
విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా వ్యవహరించిన జై శంకర్ మరోసారి కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. హరియాణా ముఖ్యమంత్రిగా వ్యవహరించిన మనోహర్ లాల్ ఖట్టర్ నరేంద్ర మోదీ కేబినెట్ చేరారు. కర్ణాటక చెందిన జేడీఎస్ నేత కుమారస్వామి గతంలో కర్ణాటక ముఖ్యమంత్రిగా వ్యవహరించిన ఆయన నేడు కేంద్ర కేబినెట్ మంత్రిగా రాష్ట్రపతి భవన్ లో ప్రమాణ స్వీకారం చేశారు. కేబినెట్ మంత్రిగా పీయూష్ గోయల్ ప్రమాణం చేశారు. ధర్మేంద్ర ప్రదాస్ మరోసారి కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఒడిశాకు చెందిన ఆయన గతంలోనూ రెండుసార్లు కేంద్ర మంత్రిగా వ్యావహరించారు. హిందూస్థాన్ ఆవామీ మోర్చాకు అధినేత జితన్ రాం మాంఘీ కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గతంలో ఆయన బిహార్ ముఖ్యమంత్రి విధులు నిర్వహించారు.






