30 August, 2026 | 12:43 PM

ప్రశాంతంగా ముగిసిన గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్

09-06-2024 09:52 PM

హైదరాబాద్ : నగరంలో గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఆదివారం ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు  జరిగింది. ఉదయం 10 గంటల తర్వాత ఒక్క నిమిషయం ఆలస్యమైనా, అభ్యర్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించలేదు.  ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బయోమెట్రిక్ విధానం, సీసీ కెమెరాల ఏర్పాటు, ప్రవేశ ద్వారాల వద్ద, అలాగే పరీక్ష కేంద్రం చుట్టూ పోలీసు పహారా ఏర్పాటు చేసి, పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. జిల్లాలో మొత్తం 40,569 మంది అభ్యర్థులకు 77 సెంటర్లు ఏర్పాటు చేయగా వారిలో 25,051 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కాగా, 15,518 మంది గైర్హాజరయ్యారు. మొత్తంగా 61 శాతం అభ్యర్థులు గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష రాశారని అధికారులు తెలిపారు.