20 June, 2026 | 2:35 AM

ఎంఆర్‌ఐ యంత్రం ప్రారంభానికి సిద్ధం

20-06-2026 12:17 AM

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

జయశంకర్ భూపాలపల్లి (మహబూబాబాద్) జూన్ 19 (విజయక్రాంతి): జయశంక ర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేయనున్న ఎం.ఆర్.ఐ  యంత్రాన్ని జిల్లా కలెక్టర్  రా హుల్ శర్మ  శుక్రవారం పరిశీలించారు. యంత్రం ఏర్పాటు పనులు తుదిదశకు చేరుకున్నాయని, ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఎం.ఆర్.ఐ యంత్రం అందుబాటులోకి రావడం వల్ల జిల్లాలోనే అధునా తన వైద్య సేవలు ప్రజలకు లభిస్తాయని తెలిపారు. ఎం. ఆర్.ఐ చేసిన వ్యక్తుల పేర్లు రిజిస్టర్ లో నమోదు చేయాలని ఆదేశించారు. ఆసుపత్రిలో రోగులకు సౌకర్యవం తమైన సేవలు అందించేందుకు అవసరమైన సిబ్బంది, సాంకేతిక సదుపాయాలు సమృద్ధిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజేంద్రప్రసాద్,  వైద్యులు పాల్గొన్నారు.