వర్షాకాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
శంకర్‌పల్లి మున్సిపల్ చైర్మన్ సాత ప్రవీణ్ కుమార్
శంకర్ పల్లి జూన్ 19 (విజయక్రాంతి): రానున్న వర్షాకాలం దృశ్య ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శంకర్ పల్లి మున్సిపల్ చైర్మన్ సాత ప్రవీణ్ కుమార్ అన్నారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో అధికా రులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ ర్షాకాలం సమీపిస్తున్నందున అధికారులు మొరుగునీరు, పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
రోడ్డుకు ఇరువైపులా ఉన్న మురుగు కాలువలను మట్టితో పూడ్చాలని, లేదంటే దోమలు ప్రబలి ప్రజలు అంటు వ్యాధులకు గురి కావడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డులలో ఉన్న విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని సూచించారు. కాలనీలలో ఉన్న పురాతన భవనాలను వెంటనే తొలగించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ శ్వేతా పాండురంగారెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కాసెట్టి చంద్రమోహన్, సీఐ ముద్దసర్ అలీ, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.






