16-10-2025 12:54:58 AM
42% కోటా సాధనలో బీసీలకు అండగా ఉంటాం
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 15 (విజయక్రాంతి): స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల సాధనకు 18న బీసీ సం ఘాలు తలపెట్టిన రాష్ర్ట బంద్‌కు ఎమ్మార్పీస్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. బీసీలకు న్యాయమైన రిజర్వేషన్ల వాటా దక్కే వరకు వారి పోరాటంలో భాగస్వామ్యం అవుతామ ని, బంద్‌ను విజయవం తం చేయడానికి తమ కార్యకర్తలు తీవ్రంగా శ్రమిస్తారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ పిలుపునిచ్చారు.
బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పి స్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తున్నట్లు తెలిపారు. గౌరవ సుప్రీంకోర్టులో సానుకూల నిర్ణయం వచ్చే లా, అన్ని అడ్డంకులను అధిగమించే విధం గా కాంగ్రెస్ ప్రభుత్వం కృషిచేయాలని, అవసరమైతే పార్లమెంటు లో చట్టం తీసుకు రావాలని ఆయన డిమాం డ్ చేశారు.
మధ్యప్రదేశ్ ప్రభుత్వం బీసీ జనాభాకు అనుగు ణంగా రిజర్వేషన్లు కల్పిస్తూ, దానికి సంబంధించిన 15,000 పేజీల ఫైల్ ను సుప్రీం కోర్టుకు సమర్పించిన విషయాన్ని మంద కృష్ణ గుర్తు చేశారు. అదే స్ఫూర్తితో, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీసీల న్యాయమైన వాటాకు మద్దతుగా సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ అసెంబ్లీ లో బీసీ రిజర్వేషన్లకు మద్దతు ఇచ్చిన బీజేపీ పెద్దలు, ఇప్పు డు సుప్రీంకోర్టులో ఎలాంటి అడ్డంకులూ లేకుం డా తమ వంతు పాత్ర పోషించాలని, ఈ విషయంలో బీఆర్‌ఎస్ పార్టీ కూడా చిత్తశుద్ధిని చాటుకోవాలని కోరారు.
50% రిజర్వే షన్ల పరిమితి తొలగిపోతేనే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు జనాభా దామాషా ప్రకారం సామాజిక న్యాయం దక్కుతుందని చెప్పారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ లక్ష్యసాధనలో బీసీలు అందించిన సహకారాన్ని, భాగస్వామ్యాన్ని తాము మర్చిపోలేమని, 42% రిజర్వేషన్లు సాధించే వరకు బీసీల పోరాటంలో ఎమ్మార్పీఎస్ భాగస్వామ్యం అవుతుందన్నారు.