16-10-2025 12:26:05 AM
హైదరాబాద్: జూబ్లీహిల్స్ లోని మంత్రి కొండ సురేఖ(Minister Konda Surekha) ఇంటి వద్ద బుధవారం రాత్రి హైడ్రామా చోటుచేసుకుంది. మంత్రి కొండ సురేఖ ఇంటికి వరంగల్ పోలీసులు మఫ్టీలో వచ్చారు. కాగా, కొండ సురేఖ ఓఎస్డిగా ఉన్న సుమంత్ ను రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతల నుంచి నిన్న తొలగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సుమంత్ కోసం పోలీసులు కొండ సురేఖ ఇంటికి వచ్చారు. దీంతో కొండ సురేఖ కుమార్తె కొండ సుస్మిత పోలీసులతో గొడవకు దిగారు. "మా ఇంటికి ఎందుకు వచ్చారు అంటూ పోలీసులతో కొండ సుస్మిత వాగ్వివాదానికి దిగారు. సుమంత్ అరెస్టుకు కారణాలు చెప్పాలని కొండ సుస్మిత అన్నారు.