calender_icon.png 16 October, 2025 | 10:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పార్కుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు

16-10-2025 01:00:51 AM

గాంధీనగర్ కార్పొరేటర్ ఎ. పావని వినయ్ కుమార్

ముషీరాబాద్, అక్టోబర్ 15 (విజయక్రాంతి): డివిజన్ లోని పార్కు ల అభివృద్ధి పనులు పూర్తి చేసేందుకు  ప్రత్యేక చర్యలు తీసుకుంటామని  గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ. పావని వినయ్ కుమార్ అన్నారు. గాంధీనగర్ డివిజన్ లోని పార్కు ల అభివృద్ధి చర్యల్లో భాగంగా బుధవారం చిక్కడపల్లిలోని వివేకనగర్ పీపుల్స్  పార్కు లో చేపట్టిన పనులను గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ. పావని వినయ్ కుమార్ సందర్శించి  పర్యవేక్షించారు.

పార్క్ చుట్టూ కాంపౌండ్ వాల్, పెయింటింగ్, లైట్ల ఏర్పా ట్లు తదితర పనులను త్వరలో పూర్తి చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు.  డివిజన్‌లోని అన్ని పార్కులను సుందరికరించేందుకు  కావలిసిన ఏర్పాట్లు పూర్తి చేశామ న్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ. వినయ్ కుమార్, బిజెపి నేతలు పి. నర్సింగ్ రావు, ప్రశాంత్,  పీపుల్స్ పార్క్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ప్రేమ్ కుమార్, గణేష్, ఆంజనేయులు, సుబ్బారావు, జితేందర్ తదితరులు పాల్గొన్నారు.