8 March, 2026 | 8:33 AM

జర్నలిస్టులకు స్ఫూర్తి ఎంఎస్ ఆచార్య

08-03-2026 12:00 AM
  1. ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు 

హైదరాబాద్ గోపనపల్లి జర్నలిస్ట్ కాలనీలో ఎంఎస్ ఆచార్య విగ్రహావిష్కరణ

హైదరాబాద్, మార్చి 7 (విజయక్రాంతి):- తెలంగాణ పోరాట యోధుడు, సీనియర్ జర్నలిస్ట్ ఎంఎస్ ఆచార్య విగ్రహాన్ని శనివారం హైదరాబాద్ గోపనపల్లిలోని జర్నలి స్ట్ కాలనీలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించారు. ఎంఎస్ ఆచార్య కుమారుడు మాడభూషి శ్రీధర్ రూ పొందించిన ఈ విగ్రహ్నాన్ని శిల్పి ఉపేంద్ర తయారుచేశారు. ఎం.ఎస్.ఆచార్య పేపర్ బాయ్ నుంచి ఎడిటర్‌గా ఎదిగి జనధర్మ, వరంగల్ వాణి వంటి పత్రికలను నడిపి ఎ న్నో అంశాలను వెలుగులోకి తీసుకొచ్చారని, ఆయన నేటి తరం జర్నలిస్టులకు ఎంతో స్ఫూర్తి అని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు.

నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు అని కొనియాడారు. ఆయన కుమారుడు మూడభూషి శ్రీధర్ కూడా తండ్రి వదలిన విలువలను ముందుకు తీసుకువెళ్తున్నారని పేర్కొన్నారు. మారుతున్న ప్రపంచానికి అ నుగుణంగా జర్నలిజం మారకూడదని ఆ యన అభిప్రాయపడ్డారు. కార్పోరేట్ రంగం మీడియాలో అడుగుపెట్టడం శుభపరిణా మం కాదనీ, అందర్ని డిక్టెట్ చేయడం, జర్నలిజాన్ని డిక్టేట్ చేయడం సరికాదని అన్నారు.

విలువలతో కూడిన జర్నలిజాన్ని ముందుకు తీసుకువెళ్లే బాధ్యత నేటి తరంపై ఉందన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడు తూ.. తెలంగాణలో నాటి తరం నుంచి నేటి తరం వరకూ అందరికీ స్పూర్తిని అందించిన వ్యక్తి ఎం.ఎస్.ఆచార్య అని అన్నారు.  మీడి యా అకాడమీ ఛైర్మన్ కె శ్రీనివాస్‌రెడ్డి మా ట్లాడుతూ.. ఎంఎస్ ఆచార్య కేవలం వరంగల్‌కే పరిమితం అయ్యారని, హైదరాబాద్‌లో ఉండి ఉంటే ఆయన స్థానం ఎక్కడో ఉండేదన్నారు.

సొసైటీకి స్థలాలు వచ్చే విధంగా మంత్రులు బాధ్యత తీసుకోవాలని కోరారు. సొసైటీ అధ్యక్షుడు బ్రహ్మాండభేరి గోపరాజు మంత్రులకు హౌసింగ్ సొసైటీ పరిస్థితిని వి వరించారు. కార్యక్రమంలో ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, స్టడీ సర్కిల్ డైరెక్టర్ మామిడి హరిక్రిష్ణ, సీనియర్ జర్నలిస్టులు ఎన్ రామచంద్రమూర్తి, వెంకటాచారి పాల్గొన్నారు.