17 April, 2026 | 4:06 PM

ముచర్ల సత్యనారాయణ విగ్రహం ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేయాలి

30-05-2025 05:48 PM

తెలంగాణ క్రాంతిదళ్ జిల్లా నాయకుడు జక్కల మత్స్యగిరి 

వలిగొండ,(విజయక్రాంతి): తెలంగాణ తొలి తరం ఉద్యమ నాయకుడు ముచర్ల సత్యనారాయణ విగ్రహం ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసి  తెలంగాణ ఉద్యమంలో ఆయన చేసిన పోరాటాన్ని పాఠ్య పుస్తకాలలో ముద్రించాలని తెలంగాణ క్రాంతిదళ్ జిల్లా నాయకుడు జక్కల మత్స్యగిరి(Telangana Kranti Dal District Leaders Jakkala Matsyagiri) డిమాండ్ చేశారు. ముచర్ల సత్యనారాయణ 1952లో తెలంగాణను ఆంధ్రాలో తెలియని చేయకముందే జరిగే ప్రమాదాన్ని ముందే పసిగట్టి హెచ్చరించిన గొప్ప మేధావి అన్నారు.

1958లో అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి తెలంగాణకు అన్యాయం చేస్తుంటే సంజీవరెడ్డి మామ నీ పైజామా ఉదగొడతము అని పాటల రూపంలో విమర్శించిన గొప్ప ధైర్యశాలి దిక్కర కవి ముచర్ల సత్యనారాయణ అన్నారు. ఇప్పటికైన తెలంగాణ ప్రభుత్వం స్పందించి జూన్ 02 తేదీ తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా ముచర్ల సత్యనారాయణ విగ్రహం ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.