17 April, 2026 | 2:31 PM

Breaking News

తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •   శ్రీ భీమేశ్వర స్వామి సేవలో ఐజీపీ రమేష్ నాయుడు   •  

తాటి చెట్టుపై నుండి పడి గీత కార్మికుడి మృతి

30-05-2025 05:44 PM

వలిగొండ,(విజయక్రాంతి): వలిగొండ మండలంలోని వెలువర్తి గ్రామంలో కల్లుగీత కార్మికుడు కొమ్మగాని వెంకటేశం రోజువారి వృత్తిలో భాగంగా తాటిచెట్టు ఎక్కడ ప్రమాదవశాత్తు కాలుజారి కింద పడడంతో తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం భువనగిరి ఏరియా ఆసుపత్రికి 108లో తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. వెంకటేశంకు ఇద్దరు కుమారులు ఉన్నారని వారికి ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ఆదుకోవాలని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు మద్దెల రాజయ్య,  మండల కల్లుగీత కార్మిక సంఘం కార్యదర్శి గాజుల ఆంజనేయులు కోరారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు పలుసం స్వామి, గ్రామ సొసైటీ అధ్యక్షులు పరకాల ముత్యాలు, పరకాల వెంకటేశం, మల్లేశం, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.