చినుకు పడితే.. చిత్తడే
ఖమ్మంపల్లి కల్వర్టు.. వద్ద బురద మయం
పట్టించుకోని అధికారులు
ఇబ్బందులు పడుతున్న ప్రజలు, వాహనదారులు
మునిపల్లి,(విజయక్రాంతి): మండలంలోని ఖమ్మం పల్లి గ్రామంలో ఇటీవల నూతనంగా కల్వర్టును నిర్మించారు. అయితే ఇంతవరకు బాగానే ఉంది కానీ వాన వస్తే మాత్రం కల్వర్టు వద్ద బురదమయంగా మారి రాకపోకలకు ప్రజలకు, వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. బ్రిడ్జి నిర్మించక ముందు అటుగా వెళ్లేందుకు కొంతవరకు ఇబ్బందులు పడుతుండడంతో కల్వర్టు ను నిర్మించారు. కానీ కల్వర్టు వద్ద నాణ్యత కూడిన మొరం వేయకపోవడంతో బురద మాయంగా మారింది. దీంతో అటుగా వెళ్లాలంటే వామ్మో.. ఆ బుర్దనా.. బైకుల మీద పోతే పడతాం.. అట్లా వద్దు.. ఊర్లో నుంచి పోదాం... అనే పరిస్థితి దాపురించింది.. చినుకు పడితే చిత్తడిగా మారడంతో వాహనదారులు ప్రజలు ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి కల్వర్టు వద్ద సీసీ లేదా బీటి రోడ్డు తమ ఇబ్బందులను తొలగించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.






