22 May, 2026 | 12:37 AM

దొంగ ఖాతాలతో కోట్ల మోసం

22-05-2026 12:01 AM

శేరిలింగంపల్లి, మే 21  (విజయక్రాంతి): సైబర్ మోసాలకు దొంగ ఖాతాలు సరఫరా చేస్తూ  కోట్లు కొల్లగొట్టడంలో  కీలకంగా వ్యవహరించిన  రాపిడో డెలివరీ బాయ్ దిలీప్  సింగ్‌ను సైబరాబాద్ సైబర్ క్రైమ్,  ఎస్‌ఓటీ పోలీసులు బుధవారం  తెల్లవారుజామున  అరెస్టు చేశారు.కేసు వివరాలను డీసీపీ కార్యాలయంలో విలేకరుల సమావే శంలో సైబర్ క్రైమ్ డీసీపీ టి.  సాయిమనోహర్ వెల్లడించారు. 

రాజస్థాన్లోని నాగూర్ జిల్లాకు  చెందిన దిలీప్ సింగ్ (27)  ప్రస్తుతం జీడిమెట్ల అపూరూప  కాలనీలో నివాసముంటూ రాపిడో  డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. నిందితుడు దిలీప్ సింగ్  నుంచి 1.02 లక్షల నగదు, 3 మొబైల్  ఫోన్లు, 12 డెబిట్ కార్డులు, 7  చెక్బుక్లు, 3 పాస్బుక్లు స్వాధీనం  చేసుకున్నట్లు డీసీపీ తెలిపారు.  కొందరు బ్యాంక్ ఉద్యోగులు కూడా  నిందితుడితో కుమ్మక్కై ఖాతాలు  తెరిచినట్లు ప్రాథమికంగా  వెలుగులోకి వచ్చిందని డీసీపీ  వెల్లడించారు.