16 May, 2026 | 10:26 PM

ఈ నెల 18 నుండి 20 వరకు మల్టీ డిపార్ట్మెంటల్ కార్యక్రమాలు నిర్వహణ

16-05-2026 09:54 PM

ఇల్లెందు,(విజయక్రాంతి): సింగరేణి  ఇల్లందు ఏరియాలోని వై.సి.ఓ.ఏ క్లబ్ లో  వివిధ విభాగాల అధిపతులు, అధికారులతో ఇల్లందు ఏరియా జియం వి.కృష్ణయ్య శనివారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ.. ఇల్లందు ఏరియా లోని ఉద్యోగులందరికీ సింగరేణి సంస్థ యొక్క ఉత్పత్తి, ఉత్పాదకత, సింగరేణిలో వాడుకలో ఉన్న మిషనరీ యొక్క పనితీరు, ఉత్పత్తి వ్యయం, కంపెనీ భవిష్యత్తు, ప్రణాళికలు, కార్మికులకు సంస్థ అందించే సంక్షేమ కార్యక్రమాలు, ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఉత్పత్తి లక్ష్యాలను సాధించడానికి కార్యచరణ (ప్రణాళిక) రూపొందించడం,

నూతన గనులు, థర్మల్, సోలార్ విద్యుత్, పంప్ స్టోర్ పవర్ ప్లాంట్, ఇతర వ్యాపార విస్తరణ అంశాలపై ఉద్యోగులకు, యూనియన్ నాయకులకు పవర్ పాయింట్ ద్వారా అవగాహనా కల్పించాలని సింగరేణి యాజమాన్యం నిర్ణయయిoచింది. ఇల్లందు ఏరియా లోని కోయగూడెం ఉపరితల గని నందు 18వ తేదిన  సి.యస్.పి., ఏరియా వర్క్ షాప్, ఏరియా స్టోర్, ఏరియా హాస్పిటల్ లలో 19వ తేదిన జియం కార్యాలయ సిబ్బంది, యం.వి.టి.సి మరియు సెక్యూరిటీ డిపార్టుమెంటు వారికీ 20వ తేదిన ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు.