సోనాలలో దొంగల భయం... రాత్రిపూట యువకుల గస్తీ
బోథ్,(విజయక్రాంతి): మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న సోనాల మండల కేంద్రంలో(Sonala Mandal Headquarters) తరచుగా దొంగతనాలు జరుగుతుండడంతో గ్రామస్తులు అప్రమత్తమయ్యారు. అందులో భాగంగానే శుక్రవారం రాత్రి నుండి యువకులు రాత్రిపూట గస్తీ నిర్వహిస్తున్నారు. యువకులంతా గ్రూపులుగా ఏర్పడి గ్రామంలో తిరుగుతున్నారు. అంతేగాక ప్రధాన వద్ద గస్తీ కాపలా కాస్తు వచ్చి పోయే వారి వివరాలు సేకరిస్తున్నారు. గ్రామ రక్షణ కోసం ప్రతి ఒక్కరు వారి వారి కాలనీలలో బందోబస్తు ఏర్పాటు చేసుకోవాలని గ్రామ సర్పంచ్ తో పాటు గ్రామ పెద్దలు వివిధ పార్టీల నాయకులు కోరుతున్నారు. వార్డు సభ్యులు సైతం రాత్రిపూట వారి వారి కాలనీలలో ప్రజలను అప్రమత్తంగా ఉండాలని కోరుతూ ముందస్తు సరే నీకు చేపట్టారు. ఏది ఏమైనా దొంగలు గ్రామస్తులను కలవర పెడుతున్నారు.పోలీసులు సైతం మండల కేంద్రం పైన నిఘా ఉంచారు.






