"చలో హైదరాబాద్" నిరుద్యోగ సభకు కదిలిన యువత
18-07-2026 08:52 AM
తంగళ్ళపల్లి, జూలై 18( విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలానికి చెందిన నాయకులు, యువకులు కలిసి హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో నిర్వహించనున్న నిరుద్యోగ సభకు హాజరయ్యేందుకు బయలుదేరారు. ఈ సందర్భంగా "చలో హైదరాబాద్" కార్యక్రమానికి మద్దతుగా పెద్ద సంఖ్యలో యువత ప్రయాణమయ్యారు. నిరుద్యోగ సమస్యల పరిష్కారం, ఉద్యోగాల భర్తీ, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతూ సభ విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మండలానికి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు, యువత పాల్గొన్నారు.






