18 July, 2026 | 9:11 AM

'Vikram-1'కు సర్వం సిద్ధం.. దేశవ్యాప్తంగా ఉత్కంఠ

18-07-2026 09:11 AM

భారత అంతరిక్ష ప్రయాణంలో చారిత్రాత్మక నూతన మైలురాయి!

న్యూఢిల్లీ: ప్రపంచం మొత్తం నేడు భారత్ వైపు చూస్తోంది. భారత ప్రైవేట్ అంతరిక్ష రంగానికి చారిత్రాత్మక రోజు. విక్రమ్-1 ప్రయోగాత్మక పరీక్షకు సర్వం సిద్ధం అయింది. విక్రమ్-1 పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైంది. స్పేస్ టెక్ స్టార్టప్ 'స్కై రూట్ ఏరోస్పేస్'(Skyroot Vikram 1 Launch) ప్రతిష్టాత్మకంగా రాకెట్ రూపొందించారు. ప్రైవేట్ సంస్థ రూపొందించిన మొట్టమొదటి ఆర్బిటాల్ క్లాస్ రాకెట్ విక్రమ్-1. శ్రీహరికోట నుంచి శనివారం ఉదయం 11.30 గంటలకు విక్రమ్-1 నింగిలోకి దూసుకెళ్లనుంది.

విషన్ ఆగమన్ పేరిట జరగనున్న ఈ ప్రయోగంపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. వందేమాతరం అని రాసిన పోస్ట్ కార్డును విక్రమ్ అంతరిక్షంలోకి తీసుకెళ్లనుంది. విక్రమ్-1 విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ పలువురు ప్రముఖులు రాసిన పోస్టుకార్డులను గగనతంలోకి తీసుకెళ్లనుంది. శాస్త్రవేత్తలు 18 క్యారెట్ల బంగారంతో చిన్న రాకెట్ ప్రతిరూపాన్ని పేలోడ్ లో పంపుతున్నారు. చిన్న రాకేట్ ప్రతిరూపాన్ని ప్రఖ్యాత సూక్ష్మ కళాకారుడు అజయ్ కుమార్ రూపొందించారు. చిన్ని బంగారు రాకెట్ పై సర్ సీవీ రామన్, విక్రమ్ సారాభాయ్, కలాం సూక్ష్మ రూపాలు ఏర్పాటు చేశారు. కాస్మోస్ డైమండ్స్ సంస్థ కాస్మిక్ బ్లూమ్ ఆర్ట్ వర్క్ అంతరిక్షంలో ప్రయాణించనుంది.