16-12-2024 12:47:19 AM
* ఫైనల్లో మధ్యప్రదేశ్‌పై విజయం
* మెరిసిన సూర్య, రహానే
బెంగళూరు: దేశవాలీ సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ విజేతగా ముంబై నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో ముంబై 5 వికెట్ల తేడాతో మధ్యప్రదేశ్‌పై విజయాన్ని సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన మధ్యప్రదేశ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. కెప్టెన్ రజత్ పటిదార్ (81 నాటౌట్) అజేయ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. అయితే పటిదార్ మినహా మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేకపోయారు. ముంబై బౌలర్లలో శార్దూల్, రాయ్‌స్టన్ డియస్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం ముంబై 17.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసి గెలుపును అందుకుంది.
సూర్యకుమార్ (35 బంతుల్లో 48) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ఆఖర్లో సుర్యాన్ష్ షెడ్గే (15 బంతుల్లో 36 నాటౌట్), అథర్వ (6 బంతుల్లో 16 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు. రహానే (30 బంతుల్లో 37) కీలక ఇన్నింగ్స్‌తో మెరిశాడు. మధ్యప్రదేశ్ బౌలర్లలో త్రిపురేశ్ 2 వికెట్లు పడగొట్టాడు. కాగా ముంబై సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ గెలవడం ఇది రెండోసారి. గతంలో 2022లో ముంబై తొలిసారి నెగ్గింది. టోర్నీలో టాప్ స్కోరర్‌గా నిలిచిన అజింక్యా రహానే (469 పరుగులు) ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలవగా.. సూర్యాన్ష్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు.