16-12-2024 12:44:35 AM
* విండీస్‌పై హర్మన్ సేన గెలుపు
ముంబై: ఆస్ట్రేలియా గడ్డపై వన్డే సిరీస్ కోల్పోయి స్వదేశంలో అడుగుపెట్టిన భారత మహిళల జట్టు వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో మాత్రం శుభారంభం చేసింది. ఆదివారం ముంబై వేదికగా జరిగిన తొలి టీ20లో హర్మన్ సేన 49 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. రోడ్రిగ్స్ (35 బంతుల్లో 73) వీరవిహారం చేయగా.. మంధాన (54) అర్థసెంచరీతో రాణించింది. విండీస్ బౌలర్లలో కరిష్మా 2 వికెట్లు పడగొట్టింది. అనంతరం వెస్టిండీస్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 146 పరుగులకు పరిమితమైంది. డియాండ్రా దొతిన్ (52) అర్థసెంచరీ చేయగా.. క్వియానా జోసెఫ్ (49) పర్వాలేదనిపించింది. భారత బౌలర్లలో టిటాస్ సాధు 3 వికెట్లు తీయగా.. దీప్తి శర్మ, రాధా యాదవ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. రెండో టీ20 మంగళవారం జరగనుంది.