calender_icon.png 23 February, 2026 | 9:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజుకు సన్మానం

23-02-2026 12:26:54 AM

వేములవాడ, ఫిబ్రవరి 22 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ మున్సిపల్ చైర్మన్గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన పుల్కం రాజు కు శుభాకాంక్షలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువాతో సత్కారం చేసి, కేక్ కట్ చేయించి అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎం.ఏ. రాహిల్, ముస్లిం టౌన్ కమిటీ పట్టణ ప్రధాన కార్యదర్శి షాహిద్ పాషా, రాష్ట్ర రజక సంఘం కన్వీనర్ మైలారం రాము, ఎం.డి. తాజ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా షాహిద్ పాషా మాట్లాడుతూ, పుల్కం రాజు సాధారణ కార్యకర్తగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదుగుతూ నేడు మున్సిపల్ చైర్మన్ స్థాయికి చేరుకోవడం పార్టీకి గర్వకారణం. వేములవాడ పట్టణ అభివృద్ధికి ఆయన సమర్థ నాయకత్వం అందిస్తారని విశ్వసిస్తున్నాం. అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటూ పారదర్శక పాలన అందించాలని కోరుకుంటున్నాం అని తెలిపారు.పట్టణాభివృద్ధి మౌళిక సదుపాయాల మెరుగుదల, ప్రజా సమస్యల పరిష్కారంలో చైర్మన్ ముందుండాలని ఆకాంక్షించారు.