15-02-2026 04:52:59 PM
హైదరాబాద్: ఇటీవల తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో 34 చోట్ల హంగ్ ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ చాలా చోట్ల అరాచకాలకు పాల్పడుతోందని, బీఆర్ఎస్ కార్పొరేటర్లను పోలీసుల ద్వారా కాంగ్రెస్ ప్రలోభపెడుతోందన్నారు. మాకు ఎక్స్అఫీషియో ఓటుపై కూడా ఇంకా స్పష్టత రాలేదని, సింగరేణిలో దోపిడీని నిరోధించేందుకు సీపీఐతో కలుస్తామని చెప్పినట్లు మాజీ మంత్రి తెలిపారు. సింగరేణలో కాంగ్రెస్, బీజేపీ భాగస్వాములై దోచుకుంటున్నాయని, కొత్తగూడెంలో సీపీఐపై ఏం ఒత్తిడి పనిచేసిందో తెలియదని ఆయన చెప్పారు.