12-02-2026 02:50:23 AM
ఎన్నికల్లో క్లీన్ స్వీప్ ఖాయం: మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
సూర్యాపేట, ఫిబ్రవరి 11 (విజయక్రాంతి): రాష్ట్రంలో దాదాపు అన్ని పురపాలికలు కాంగ్రె స్ ఏలికలోకి రాబోతున్నాయని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా కోదాడ పురపాలక సంఘం పరిధిలోని 14వ వార్డులో బుధవారం తమ ఓటు హక్కును ఆయన సతీమణి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతీతో కలిసి వినియోగించుకున్నారు. అనంత రం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో మళ్లీ అధికారం చేపట్టబోయేది ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీయేనని జోస్యం చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విప్లవాత్మక సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం పురపాలక ఎన్నికల్లో గేమ్ చేంజర్‌గా మారిందన్నారు. పురపాలక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ క్లిన్ స్వీప్ చేయనుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం బలపడిందని, మరో ఎనిమిది ఏళ్లు రాష్ట్రాన్ని పాలించేది కాంగ్రెస్సేనని పునరుద్ఘాటించారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఒరిగిం ది ఏమీ లేదని, అందుకే విసుగు చెందిన ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని ఉత్తమ్ చెప్పారు.