భార్యపై అనుమానంతో హత్య
అర్మూర్, మే 19 (విజయ క్రాంతి) : భార్యపై అనుమానంతో అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన సోమవారం వెలుగు చూసింది. వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో హత్య చేసినట్లు తెలుస్తోంది.
వివరాల్లోకి వెళితే... అర్మూర్ పట్టణంలోని పెద్ద బజార్ కు చెందిన ముద్దంగుల గంగాధర్ కు నవిపేట మండలం శాటాపూర్ గ్రామానికి చెందిన అంజలితో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్ళ్ళున కొంత కాలం నుంచి భార్య భర్తలు ఇద్దరు తరచూ గొడవ పడుతుండేవారు. అంజలి వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టకుందని గొడవ పడేవాడు.
సోమవారం ఇదే విషయంలో గొడవ జరగడంతో కోపంతో ఇంట్లో ఉన్న కత్తి తీలుకొని కిరాతకంగా పొడిచాడు. గొంతుపై, కడుపులో విచక్షణ రహితంగా పొడవడంతో అంజలి అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
జిల్లా సీపీ సాయి చైతన్యకు సమాచారం ఇవ్వడంతో ఆయన సైతం సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అర్మూర్ సిఐ సత్యనారాయణ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతురాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు.






