20-05-2025 12:03:55 AM
ప్రజావాణిలో కలెక్టర్‌ను కోరిన గడ్డపోతారం వాసులు
పటాన్ చెరు, మే 19 : మున్సిపల్ కేంద్రం గడ్డపోతారంలోని తెలంగాణ కాలనీ సర్వేనంబర్ 27, సర్వేనంబర్ 10 ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు జరుగు తున్నాయని దీనిపై విచారణ జరిపి అక్రమ నిర్మాణాలను తొలగించి ప్రభుత్వ భూమిని కాపాడాలని గడ్డపోతారం వాసులు ప్రజావాణిలో కలెక్టర్ ను కోరారు. ఈ మేరకు బాలయ్య, నారబోయిన శ్రీనివాస్, సత్యనారాయణ, నారబోయిన నాగరాజు సోమవారం కలెక్టరేట్లో వినతి పత్రాన్ని అందజేశారు.
సర్వేనంబర్ 27, 10లో కొందరు వ్యాపారులు ప్రభుత్వ భూమిని ప్లాట్లుగా చేసి విక్రయిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ, అసైన్డ్ భూమిలో ప్లాట్లు చేసి విక్రయిస్తుంటే అధికారులు అడ్డుకోకుండా మద్దతు తెలుపుతున్నారని తెలిపారు. అక్రమ నిర్మాణాల నుంచి ప్రభుత్వ భూమిని కాపాడి భవిష్యత్తు అవసరాల కోసం కేటాయించాలని కోరారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు.