17 April, 2026 | 11:46 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

హత్యాచార నిందితులను కఠినంగా శిక్షించాలి

01-04-2025 05:08 PM

బీఎస్పీపార్టీ జిల్లా అధ్యక్షుడు పొన్నం బిక్షపతి గౌడ్..

చిట్యాల (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలంలో ముదిరాజు కులానికి చెందిన యువతిపైన హత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని బీఎస్పీ పార్టీ జిల్లా అధ్యక్షుడు పొన్నం బిక్షపతి గౌడ్ డిమాండ్ చేశారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సభ్య సమాజం తలదించుకునేలా జరుగుతున్న హత్యాచారాలకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు.

ఏడుగురిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అలాగే క్రిస్టియన్ పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతి హత్యగా అనుమానిస్తున్నామని, వెంటనే పోస్టుమార్టం రిపోర్ట్ ను బహిర్గతం చేయాలని కోరారు. మళ్ళీ ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయిలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఈసీ మెంబర్ సంగీ రవి, జిల్లా ఇన్చార్జ్ వేల్పుగొండ మహేందర్, మండల అధ్యక్షుడు సురేందర్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు మేకల ఓంకార్ తదితరులు పాల్గొన్నారు.