16 March, 2026 | 5:46 PM

హత్యకు గురైన గిరిజనుడు

16-03-2026 03:35 PM

జైనూర్,(విజయక్రాంతి): కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం రాంనగర్ కాలనీలో గిరిజనుడు కుర్సెంగా అర్జున్ అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన వెలుగులోకి వచ్చింది. జైనూర్ సీఐ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం, రాంనగర్ కాలనీలో నిర్మాణంలో ఉన్న ఓ నూతన భవనంలో అర్జున్ మృతదేహం కనిపించిందని కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించారు. 

మృతుడు కుర్సెంగా అర్జున్‌కు సుమారు 20 సంవత్సరాల క్రితం వివాహం జరిగి ఇద్దరు కుమారులు ఉన్నారు. వ్యక్తిగత కారణాల వల్ల భార్యతో విడాకులు తీసుకుని ఒంటరిగా జీవిస్తున్నాడు. కట్టెలు అమ్ముకొని జీవనం సాగిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వ్యక్తిగత విభేదాల కారణంగా  దాడి చేసి హత్య చేసినట్లు ప్రాథమికంగా అనుమానం వ్యక్తమవుతోంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని సీఐ రమేష్ తెలిపారు. పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడిస్తామని చెప్పారు.