7 April, 2026 | 1:36 PM

Breaking News

కేరళ సీఎంకు తెలంగాణ సీఎం సవాల్!   •   తెలంగాణలో గడ్డి మందు నిషేధం   •   సాగర్ కాలవలో ప్రాణాపాయంలో గోమాత… ప్రాణాలకు తెగించి కాపాడిన రానా   •   షాకింగ్ ఘటన: బంధువుల దాడిలో న్యాయవాది హత్య.. అన్నమయ్య జిల్లాలో కలకలం!   •   బీఆర్‌ఎస్‌ నేతల గృహనిర్బంధాలపై కేటీఆర్‌ ఆగ్రహం   •   పెద్దపల్లి ఎమ్మెల్యేను సన్మానించిన జిల్లా యాదవ సంఘం నాయకులు   •   శాంతి భద్రతల పరిరక్షణ కొరకే... కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం   •   300 క్వింటాళ్ల రేషన్​ బియ్యం పట్టివేత   •   ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ   •   మమ్మల్ని అరెస్ట్ చేసి అడ్డుకున్నా— పరిగివెళ్లి పోరాటం చేస్తాం   •  

మూసీ తొలి అడుగు

12-02-2026 01:43 AM

నది పరీవాహక అభివృద్ధికి గెజిట్ నోటిఫికేషన్

  1. భూ సేకరణ ప్రక్రియకు శ్రీకారం
  2. మొదటి విడతగా రంగారెడ్డి జిల్లాలో 50 ఎకరాల సేకరణ 
  3. గోల్కొండ, గండిపేట మండలాల్లో సర్వే నంబర్ల గుర్తింపు 
  4. మార్కెట్ విలువ ప్రకారమే నష్టపరిహారం 
  5. అభ్యంతరాల స్వీకరణకూ ప్రజలకు అవకాశం

హైదరాబాద్, సిటీ బ్యూరో ఫిబ్రవరి 11 (విజయక్రాంతి):  తెలంగాణ ప్రభు త్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తు న్న మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టు కార్యరూపం దాల్చే దిశగా కీలక ముందడుగు పడింది. ప్రాజెక్టు పనులు క్షేత్రస్థాయిలో  మొదలు పెట్టేందుకు ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోం ది. ఇందులో భాగంగా మూసీ రివర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యం లో నది పరీవాహక ప్రాంతాల అభివృద్ధికి అధికారికంగా భూసేకరణ ప్రక్రి యకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ద్వారా తాజాగా ప్రాథమిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

రంగారెడ్డి నుంచే భూసేకరణ..

మూసీ సుందరీకరణలో భాగంగా తొలి విడత భూసేకరణను రంగారెడ్డి జిల్లా నుంచి ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా జిల్లాలోని గోల్కొండ, గండిపేట మండలాల పరిధిలో 50 ఎకరాలకు పైగా భూమిని సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అధికారులు ఆయా గ్రామాల వారీగా సర్వే నంబర్లతో కూడిన సమగ్ర జాబితాను నోటిఫికేషన్‌లో పొందుపరిచారు. వాస్తవానికి ఈ ప్రాజెక్టు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్నప్పటికీ, ఆపరేషన్ మొదట రంగారెడ్డి నుంచే మొదలవ్వడం గమనార్హం.

నిర్వాసితులకు ప్రభుత్వం భరోసా.. 

భూములు కోల్పోతున్న రైతులు, యజమానులలో ఆందోళన కలగకుండా ప్రభు త్వం ముందుగానే భరోసా కల్పించింది. ప్ర స్తుత మార్కెట్ విలువ ఆధారంగానే బాధితులకు తగిన నష్టపరిహారం చెల్లిస్తామని స్పష్టం చేసింది. అభివృద్ధి పేరుతో ఎవరికీ అన్యా యం జరగకూడదన్న ఉద్దేశంతో పారదర్శకంగా వ్య వహరిస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.  

అభ్యంతరాలకు ఆహ్వానం..

ప్రభుత్వం గుర్తించిన భూములకు సం బంధించి యజమానులకు ఏవైనా అభ్యంతరా లు ఉంటే తెలియజేయడానికి అవకాశం కల్పించారు. నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి నిర్ణీత గడువులోగా సంబంధిత అధికారులకు లిఖితపూర్వకంగా తమ అభ్యంతరా లను సమర్పించాలని సూచించారు. రైతులు లేదా భూయజమానుల నుంచి వచ్చే అభ్యంతరాలను పరిశీలించిన తర్వాతే తదుపరి చర్యలు ఉంటాయని నోటిఫికేషన్‌లో స్పష్టం చేశారు. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే అభివృద్ధి పనులు వేగవంతం కానున్నాయి.