5 April, 2026 | 5:31 AM

హాలీవుడ్ ఎంట్రీ థ్రిల్లింగ్‌గా ఉంది!

05-04-2026 12:00 AM

బాలీవుడ్ సెన్సేషన్ బ్యూటీ సన్నీ లియోన్ కెరీర్‌లో మరో మైలురాయిని అందుకున్నది. ఇటీవల ‘కెన్నెడీ’ సినిమాతో మెప్పించిన ఈ భామ ఇప్పుడు ఏకంగా హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. అమెరికాకు చెందిన ‘ది జైంట్’ అనే వెబ్‌సిరీస్‌లో సన్నీ ఒక కీలక పాత్రకు ఎంపికయింది. హాలీవుడ్ నటుడు కెవిన్ బీ ప్లాత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ యాక్షన్ సిరీస్ ఇది. ఇందులో సన్నీ లియోన్ క్వాన్ డీర్లీఫ్ అనే రిజర్వేషన్ షెరీఫ్ పాత్రలో కనిపించనుంది.

ఇప్పటివరకు గ్లామర్ పాత్రలతో రంజింపజేసిన సన్నీ.. ఈసారి ఖాకీ డ్రెస్ వేసుకుని శక్తిమంతమైన పోలీస్ ఆఫీసర్‌గా అలరించను్ంతంది. ఈ సిరీస్‌ను మాజీ సైనికోద్యోగులు నడిపే ఆర్టిమిస్ థియేట్రికల్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఈ కొత్త ప్రాజెక్ట్ గురించి సన్నీ మాట్లాడుతూ.. ‘ఇది నేను గతంలో చేసిన వాటికంటే చాలా భిన్నమైన పాత్ర.

పూర్తిగా కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టడం నాకు ఎంతో థ్రిల్లింగ్‌గా ఉంది. ఈ ప్రయాణం కోసం నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. నేను ఈ పాత్ర ను ఎంత ఎంజాయ్ చేస్తున్నానో, నా అభిమానులూ స్క్రీన్ మీద అంతే ఎంజాయ్ చేస్తారు’ అన్నది.  సన్నీ చేతిలో ఇప్పుడు మరికొన్ని చిత్రాలూ ఉన్నాయి.