సీఎం చేతుల మీదుగా ఉగాది పురస్కారాన్ని అందుకున్న ఎన్‌ఎకే రామస్వామి
కొడంగల్, మార్చి 19 (విజయక్రాంతి) : తెలుగు నూతన సంవత్సరమైన ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కొడంగల్ శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయ పూజారి రామస్వామి ఉగాది పురస్కారాన్ని అందుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ మరియు దేవాదాయ,
ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో గురువారం రవీంద్ర భారతి లో నిర్వహించిన తెలుగు నూతన సంవత్సరం శ్రీ పరాభవ నామ ఉగాది వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పేదల తిరుపతిగా పేరుగాంచిన కొడంగల్ పట్టణంలోనీ శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయ పూజారి ఎన్‌ఏకె రామస్వామికి ఉగాది పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయ సిబ్బంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.




