20 March, 2026 | 1:16 PM

ప్రతి పేదవాడికి సొంతిల్లు చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య

20-03-2026 12:00 AM

మొయినాబాద్, మార్చి 19: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా అర్హులైన ప్రతి ఒక్క కుటుంబానికి గృహ వసంతి కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య తెలిపారు. గురువారం మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని 18, 25 వార్డులలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ముఖ్యఅతిథిగా పాల్గొని గృహ ప్రవేశ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలే యాదయ్య మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా అర్హులైన ప్రతి ఒక్క కుటుంబానికి గృహ వసంతి కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఆయన అన్నారు. గృహాలు మంజూరైన ప్రతి ఒక్కరు ఇంటి నిర్మాణం చేపట్టాలని సూచించారు. పేదల సొంతింటి కళ నెరవేర్చడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంతో ఆ దిశగా ఆయన ముందుకు వెళుతున్నారని తెలిపారు. పేదలను ఆదుకునేందుకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతూ.. మరోవైపు అభివృద్ధిలో ముందుకు దూసుకువెళ్తుందన్నారు.

ఇందిరమ్మ ఇల్లును ప్రారంభించిన ఎమ్మెల్యే కాలే యాదయ్య..

శంకర్ పల్లి; మార్చి 19 (విజయక్రాంతి):  శంకర్ పల్లి మున్సిపల్ పరిధిలోని 13 వ వార్డులో గురువారం చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ఇందిరమ్మ ఇల్లును ప్రారంభించారు. ఈ సందర్భంగా చేవెళ్ల నియోజకవర్గం ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి గృహ వసతి కల్పించడమే లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ సాతా ప్రవీణ్ కుమార్, వైస్ చైర్మన్ జూలకంటి శ్వేతా పాండురంగారెడ్డి, కౌన్సిలర్లు చాకలి అశోక్, ప్రశాంత్, విజయ్ కుమార్, శంకర్‌పల్లి ఏఎంసి డైరెక్టర్ ఎండి.సర్‌తాజ్, రాజీ కౌన్సిలర్ చంద్రమౌళి పాల్గొన్నారు.