6 July, 2026 | 12:42 PM

ప్రమాదాలకు నిలయాలు.. ఈ గుంతలు

06-07-2026 11:30 AM

పట్టించుకొని ఆర్ అండ్ బి అధికారులు...

బాన్సువాడ,జూలై6(విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా(Nizamabad District) రుద్రూరు మండల కేంద్రం నుంచి బోధన్ వెళ్లే ప్రధాన రహదారి గుంతలు ఏర్పడి ప్రమాదాలకు నిలయాలుగా మారాయి. బోధన్ కు వెళ్లే రహదారి రైస్ మిల్ సమీపంతో పాటు పాత బొక్కల ఫ్యాక్టరీకి సమీపంలో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడినాయి. వర్షాకాలంలో గుంతలుగా ఏర్పడి నీరు నిండడంతో ప్రయాణికులకు ప్రమాదాలుగా మారాయి.

గుంతలో పడి పలువురు ప్రయాణికులకు గాయాలైన సంఘటనలు ఉన్నాయి. అయినప్పటికీ చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు ఆర్ అండ్ బి అధికారులు. భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా ఉండాలి అంటే ఆర్ అండ్ బి అధికారులు వెంటనే మరమ్మత్తులు చేయించాలని ప్రజలు, ప్రయాణికులు ప్రమాదాల బారిన పడకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు, ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.