24 February, 2026 | 8:48 PM

నాగోల్ ఎస్టీపీ ట్రయల్ రన్ ప్రారంభం

16-07-2024 03:08 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 15 (విజయక్రాంతి): ఎస్టీపీ ప్రాజెక్టుల్లో భాగంగా ప్యాకేజీ  నిర్మిస్తున్న నాగోల్ ఎస్టీపీ ట్రయల్ రన్‌ను సోమవారం జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి ప్రారంభించారు. నాగోల్ ఎస్టీపీని ఈ నెలాఖరు నాటికి ప్రారంభించేలా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎస్టీపీ ప్రాంగణంలో పర్యటించి సీసీరోడ్లు, లైటింగ్ పనులను పరిశీలించారు. అంతర్గత రహదారుల నిర్మాణం సహా పనులను త్వరగా పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని ఆదేశించారు. అనంతరం ఎస్టీపీ ప్రాంగణంలో మొక్కను నాటారు. కార్యక్రమంలో ఈడీ ఎం సత్యనారాయణ, ప్రాజెక్టు డైరెక్టర్  2 సుదర్శన్, సీజీఎం, జీఎం, ఎస్టీ పీ ఇతర అధికారులు పాల్గొన్నారు.