ఢిల్లీ జట్టులోకి నైబ్
27-04-2024 12:26 AM
న్యూఢిల్లీ: అఫ్గానిస్థాన్ ఆల్‌రౌండర్ గుల్బదిన్ నైబ్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో చేరాడు. గాయంతో అర్ధాంతరంగా తప్పుకున్న మిచెల్ మార్ష్ స్థానంలో గుల్బదిన్‌ను జట్టులోకి తీసుకున్నట్లు ఢిల్లీ యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది. కనీస ధర రూ. 50 లక్షలతో గుల్బదిన్‌ను జట్టులోకి తీసుకుంది. ఈ సీజన్‌లో నాలుగు మ్యాచ్‌లాడిన మా ర్ష్ గాయంతో స్వదేశానికి వెళ్లిపోయా డు. 4 మ్యాచ్‌ల్లో కేవలం 61 పరుగులు మాత్రమే చేసిన ఆసీస్ ఆల్‌రౌండర్ ఏమాత్రం ఆకట్టుకోలేక పోయాడు. ఇక గుల్బదిన్‌కు ఇదే తొలి ఐపీఎల్ సీజన్. ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 9 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతోంది.






