17 April, 2026 | 10:09 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

నాంపల్లి లక్ష్మీనరసింహస్వామి కోనేరులో పడి

09-06-2025 12:30 AM

ములుగు జిల్లా వాసి మృతి

సిరిసిల్ల జూన్ 8 (విజయక్రాంతి): ములుగు జిల్లా మల్లంపల్లి మండలం భూపాల్ నగర్ పందికుంట కు చెందిన సాదం రాజు 32 రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వద్ద ఉన్న కోనేరులో పడి ప్రమాదవశాత్తు మృతి చెం దాడు.సాదం సమ్మయ్యకు ముగ్గురు కుమారులు కాగా రాజు 32 రెండో కుమారుడు కాకతీయ విశ్వవిద్యాలయంలో  పీజీ, ఎం ఈ డి పూర్తి చేసి ప్రభుత్వ కొలువుల కోసం ప్రిపే ర్ అవుతున్నాడు.

తిరుపతి, వేములవాడ దైవదర్శనాల కోసం వెళ్లి వస్తానని 05/06/ 2025 తేదీన ఉదయం 8 గంటలకు ఇంటి నుండి బయలుదేరాడు. 08/06/2025 ఉ దయం 5:30లకు  రాజు బంధువైన జక్కుల మహేందర్ వేములవాడ దైవదర్శనానికని వచ్చి రాజుకు కాల్ చేయగా రాజు లిఫ్ట్ చేయలేదు.

అయితే రాత్రి జక్కుల మహేందర్ తో రాజు ఉదయం లక్ష్మీనరసింహస్వామి టెంపు ల్ కు వెళ్తానని చెప్పినాడని అయితే రాజు సడన్గా కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో సదురు బంధువులతో పాటు లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ ఆవరణలో వెతక సాగారు పక్కనే ఉన్న కోనేరులో దగ్గర రాజుకు సంబంధించిన బ్యాగు, చెప్పులు, పర్సు, తన లభించడం తో అనుమానంతో కోనేరులో పడి ఉంటాడని వెతికే ప్రయత్నం చేయగా రాజు డెడ్ బా డీ లభించింది.

వేములవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టం కోసం బాడీని ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. మృతికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పంచనామా అనంతరం ములుగు జిల్లా మల్లంపల్లి మం డలం భూపాల్ నగర్ పందికుంటకు రాజు మృతదేహం చేరుకోనుంది.