17 April, 2026 | 11:49 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

చేప మందు మూఢ నమ్మకం

09-06-2025 12:30 AM

రిటైర్డ్ కర్నల్ డాక్టర్ మాచర్ల బిక్షపతి

జనగామ, జూన్ 8 (విజయక్రాంతి): చేప మందుతో అస్తమా తగ్గుతుందనేది పచ్చి బూటకమని రిటైర్డ్ కర్నల్ డాక్టర్ మాచర్ల బిక్షపతి అన్నారు. మృగశిర కార్తె సందర్భంగా చేపమందు పంపిణీ పై ఆయన విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆదివారం జనగామలో ఆయన మాట్లాడారు. ఆధునికంగా, సాంకేతికంగా భారతదేశం దినదినాభివృద్ధి చెందుతున్న తరుణంలో ఆశాస్త్రీయ విధానాలను తిప్పికొట్టాల్సిన అవసరం ఉందన్నారు.

అసమాకు అలోపతిలో మంచి వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఆశాస్త్రియ విధానాలను నమ్మి ప్రజలు మోసపోవద్దని సూచించారు. చేప మందు పంపిణీలో బ్రీడ్ , నీరు ఎలాంటివి వాడుతున్నారో తెలియదని, దానికి ఒక ఫార్ములా అంటూ లేదని స్పష్టం చేశారు.

ఒకవేళ దానితో ప్రయోజనం ఉంటే ఏడాదికి ఒకేసారి కాకుండా నిత్యం అందుబాటులో ఉంచ వచ్చు కదా అని అనుమానం వ్యక్తం చేశారు.  సరైన రుజువు లేని చేప మందు పంపిణీకి ప్రభుత్వం ఏకంగా స్పెషల్ బస్సులు ఏర్పాటు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.