కరాటేలో ఖానాపూర్ వాసికి నంది అవార్డు

21-09-2026 | 06:30pm

ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా(Nirmal District) ఖానాపూర్ మండలం మస్కాపూర్ గ్రామానికి చెందిన చిలుకూరి శ్రీనివాస్ కు కరాటే విభాగంలో నంది బహుమతి లభించింది. ఆదివారం హైదరాబాద్ పట్టణం ఎల్బీనగర్ లో స్పోర్ట్ ఇండోర్ స్టేడియంలో గ్లోబల్ ఎక్స్లెన్సీ ఐకాన్ వారు నిర్వహించిన ఒక కార్యక్రమంలో కరాటే విభాగంలో నంది అవార్డు(Nandi Award) బహుకరించారని శ్రీనివాస్ సోమవారం ఇక్కడ విలేకరులకు తెలిపారు. స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అవార్డ్స్ అసోసియేషన్(Sports and Cultural Awards Association) ద్వారా ఈ అవార్డు ఇచ్చినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కరాటే అకాడమీ(Karate Academy) వ్యవస్థాపకులు కేశవ్ గౌడ్, అమాచ్యుర్ అవార్డు అసోసియేషన్ ఫౌండర్ అమర్ సింగ్, శ్రీలంక దేశానికి చెందిన ఇంటర్నేషనల్ మాస్టర్ కోచ్ ఆర్ బాల శ్రీధరన్, తదితరులు ఉన్నారని ఈ క్రీడలో ఎన్నో అంతర్జాతీయ పోటీలలో పాల్గొని ఇదివరకే అవార్డులు పొందడమే కాకుండా తన శిష్యులకు కూడా జాతీయస్థాయిలో పోటీలో పాల్గొనేలా చేసినందుకు ప్రతిభను గుర్తించి అంతర్జాతీయ నంది అవార్డు ఇవ్వడం జరిగిందని తెలిపారు.

మరిన్ని వార్తలు