మే 10న థియేటర్లలోకి ప్రతినిధి 2

06-05-2024 12:05:00 AM

రాజకీయ వ్యవస్థలోని అవినీతిని పాత్రికేయుడిగా ప్రజల ముందుకు తీసుకురానున్నారు నారా రోహిత్. ఆయన కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘ప్రతినిధి 2’. గతంలో ఏప్రిల్ 25న విడుదల తేదీగా ప్రకటిచిన చిత్ర బృందం తర్వాత వాయిదా వేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా విడుదల తేదీపై ఒక నిర్ణయానికి వచ్చిన దర్శక నిర్మాతలు ఈ విషయంపై స్పష్టతనిస్తూ విడుదల తేదీ ప్రకటించారు. ఈ మేరకు మే 10న ‘ప్రతినిధి 2’ విడుదల చేస్తున్నట్టు  తెలిపిన చిత్ర వర్గాలు ఒక పోస్టర్‌ను సోషల్  మీడియా ద్వారా విడుదల చేశాయి. ఇప్పటికే చిరంజీవి విడుదల చేసిన టీజర్, సుకుమార్ విడుదల చేసిన ట్రైలర్ సినిమా ఎలా ఉండనుందన్న విషయంలో ప్రేక్షకులు ఓ అంచనాకు వచ్చేలా చేశాయి. ప్రస్తుత ప్రత్యక్ష రాజకీయాలకి ‘ప్రతినిధి 2’కి ఏమాత్రం సంబంధం లేదని దర్శక నిర్మాతలు చెబుతండగా, ఆంధ్రప్రదేశ్‌లో జరుగనున్న ఎన్నికలకు మూడు రోజుల ముందు ఈ సినిమా థియేటర్లలోకి రావడం గమనార్హం.