నెల ఆలస్యంగా భారతీయుడి రాక!

06-05-2024 12:05:00 AM

అగ్ర దర్శకుడు శంకర్  ప్రముఖ కథానాయకుడు కమల్ హాసన్ కలయికలో తెరకెక్కిన తాజా చిత్రం ‘ఇండియన్ 2’. సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న  చిత్రాలలో ఈ సీక్వెల్ కూడా ఒకటి. అయితే వారికి మరికొన్ని రోజులు ఈ ఎదురుచూపులు తప్పేలా లేవు. విడుదల తేదీపై స్పష్టత లేకపోయినా జూన్‌లో ‘ఇండియన్ 2’ సినిమాని తెరమీదికి తీసుకొస్తున్నట్టు కొంత కాలం క్రితం చిత్ర యూనిట్ అధికారికంగా తెలిపింది. అయితే సినిమా నిర్మాణాంతర పనులలో జాప్యం కారణంగా ఇది మరి కాస్త ఆలస్యం కానుందట. ఆ కారణం చేత ఈ సినిమా విడుదల జూన్ నుండి జులైకి మారిందని చెన్నై వర్గాలు చెబుతున్నాయి. అటు దర్శకుడు శంకర్ సైతం ‘గేమ్ చేంజర్’ చిత్రీకరణలో నిమగ్నమై ఉన్నారు. ఈ వేసవిలో అగ్ర హీరోలెవరూ తెరమీదికి రానందున ‘ఇండియన్ 2’ సినిమాపై ఆసక్తి నెలకొన్న మాట వాస్తవం. అయితే ఈ సినిమా వాయిదా ఒక రకంగా ‘కల్కి’ చిత్రానికి కలిసొచ్చే అంశం. కాగా ‘ఇండియన్ 2’ కోసం జులై 11, 17 తేదీలను పరిశీలిస్తున్నాయట లైకా నిర్మాణ వర్గాలు.