6 March, 2026 | 10:48 PM

మున్సిపాలిటీ పాలకవర్గాన్ని సన్మానించిన నరేందర్ రెడ్డి

06-03-2026 02:38 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపాలిటీ పాలకవర్గాన్ని ఆల్ ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు, శుక్రవారం సుల్తానాబాద్ మున్సిపాలిటీ కార్యాలయం ఆవరణలో 99 రోజుల ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

నూతనంగా ఎన్నికైన చైర్మన్ బిరుదు రాధాకృష్ణ, వైస్ చైర్మన్ అంతటి పుష్పలతతో పాటు కౌన్సిలర్లకు శుభాకాంక్షలు తెలియజేసి ఘనంగా సన్మానించారు. అలాగే మున్సిపల్ కమిషనర్ రమేష్ ను సన్మానించారు... అనంతరం నరేందర్ రెడ్డిని చైర్మన్, వైస్ చైర్మన్ తో పాటు కౌన్సిలర్లు ఘనంగా సన్మానించారు.