5 May, 2026 | 8:33 PM

Breaking News

మేక మన్వితను సన్మానించిన డీఈవో   •   క్యాసారంలో రేణుక ఎల్లమ్మ దర్శించుకున్న టిఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత   •   ఎఫ్‌సీఆర్‌ఐ ములుగులో యువతకు గుండె ఆరోగ్యంపై అవగాహన   •   సికింద్రాబాద్‌లో ATM నగదు దుర్వినియోగం కేసు – నిందితుడు అరెస్ట్   •   లక్ష్యంతో చదివితేనే ఉత్తమ ఫలితాలు   •   హిందువుల మనోభావాలు దెబ్బతియాలని చుస్తే సహించేది లేదు   •   కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా వీడ్కోలు వేడుకలు   •   ఆయిల్ పామ్ సాగుతో రైతులకు దీర్ఘకాలిక ఆదాయం   •   నూతన టెండర్ల లబ్దిదారులు అమ్మవారి సేవలో పాత్రులు కావాలి: డాక్టర్ కోట నీలిమ   •   గిరిజనుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యం   •  

ప్రజాపాలన ప్రగతి ప్రణాళికను విజయవంతం చేయాలి

06-03-2026 02:42 PM

ములుగు డిఎల్పీఓ శ్రీధర్

మంగపేట,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని ములుగు డివిజన్ స్థాయి పంచాయతీ ఆఫీసర్ ( డిఎల్పీఓ ) శ్రీధర్ అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంపై శుక్రవారం మంగపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మంగపేట మండల పరిషత్ అభివృద్ధి అధికారి బి. భద్రు నాయక్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి హాజరైన ములుగు డిఎల్పీఓ శ్రీధర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ... ప్రజా పాలన ప్రణాళికలో భాగంగా డిపార్ట్మెంట్ వారీగా చేయవలసిన ప్రణాళికలు రచించి దానికి అనుగుణంగా డిపార్ట్మెంట్ వారీగా చేయవలసిన కార్యక్రమాల గురించి వివరించారు. పారిశుధ్యం, వేసవి కాలంలో నీటి ఎద్దడి, ఉపాధి హామీ, ప్రజా ఆరోగ్యం పట్ల ప్రత్యేక కార్యక్రమాలతో పాటు ఆయా శాఖలకు సంబందించిన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.

ఈ సమావేశంలో తహసీల్దార్ తోట రవీందర్, మండల వ్యవసాయ శాఖ అధికారి నేదునూరి చేరాలు, ఆర్డబ్ల్యూఎస్ ఎ.ఈ యాకయ్య,  డీఆర్డిఓ డిపీఎం సుజాత, ఐకేపీ ఎపీఎం సత్యనారాయణ, ఎన్ఆర్ఈజీఎస్ ఎపీఓ అంకూస్, పంచాయతీ కార్యదర్శులు, ఎన్ఆర్ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.