ప్రధాని పదవికి నరేంద్ర మోడీ రాజీనామా
05-06-2024 03:05 PM
న్యూఢిల్లీ: ప్రధాని పదవికి నరేంద్ర మోడీ బుధవారం రాజీనామా చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి రాజీనామా లేఖ అందించారు. నరేంద్ర మోడీ రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు. కొత్త కేబినెట్ ప్రమాణ స్వీకారోత్సవానికి ముందు ప్రధాని రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమై తన మంత్రి మండలితో కలిసి రాజీనామా సమర్పించారు. 17వ లోక్‌సభను రద్దు చేయాలని కూడా ఆయన సిఫార్సు చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగాలని రాష్ట్రపతి కోరారు.






