మోడీ నివాసంలో ఎన్డీయే సమావేశం ప్రారంభం
05-06-2024 04:21 PM
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో ఎన్డీయే సమావేశం బుధవారం సాయంత్రం ప్రారంభం అయింది. ఈ సమావేశానికి చంద్రబాబు, పవన్ కల్యాణ్, నితీశ్‌కుమార్, అమిత్ షా, రాజ్‌నాథ్, గడ్కరీ హాజరయ్యారు. లోక్ సభ ఎన్నికల తర్వాత జరుగుతున్న తొలి ఎన్డీఏ సమావేశం ఇది. నిన్న విడుదలైన ఫలితాల్లో ఎన్డీఏ కూటమికి 292 సీట్లు వచ్చాయి. 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం ప్రధాని మోడీ నేతృత్వంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటుపై ఎన్డీఏ పక్షాలు ఈ భేటీలో చర్చించనున్నాయి. ప్రధాని ప్రమాణ స్వీకారంపై కూడా అధికారికంగా నిర్ణయం తీసుకునే అవకాశముందని బీజేపీ వర్గాలు తెలిపాయి.






