30 July, 2026 | 2:49 PM

లోక్ సభలో ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోడీ

24-06-2024 11:20 AM

న్యూఢిల్లీ: పార్లమెంట్ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి.18వ లోక్‌సభ సమావేశానికి ముందు ప్రొటెం స్పీకర్‌గా బిజెపి ఎంపి భర్తృహరి మహతాబ్‌తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. సభా నాయకుడిగా ఉన్న ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కొత్తగా ఎన్నికైన ఎంపీలతో ఆయన ప్రమాణం చేయనున్నారు. లోక్ సభలో ప్రధాని నరేంద్ర మోడీ, రాధామోహన్ సింగ్, రాజ్ నాథ్ సింగ్, ఫగ్గన్ సింగ్ కులస్తే, నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్  చౌహన్ ప్రమాణ స్వీకారం చేశారు.

లోక్‌సభ తొలి సెషన్‌లో కొత్తగా ఎన్నికైన ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్, ఇండియా బ్లాక్ ఎంపీలు సహకరించకుండా ఉండేందుకు అవకాశం ఉంది. బీజేపీ ఎంపీ భర్తృహరి మెహతాబ్‌ను నియమించడంపై ఇండియా కూటమి అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎనిమిది సార్లు కాంగ్రెస్ ఎంపీగా ఎన్నికైన కే సురేష్‌కు బదులు ప్రొటెం స్పీకర్ గా భర్తృహరి మెహతాబ్‌ కు అవకాశం ఇచ్చారు. రెండు రోజుల ప్రమాణ స్వీకారోత్సవం తర్వాత, జూన్‌లో లోక్‌సభ స్పీకర్ ఎన్నిక జరగనుంది. 26, జూన్ 27న ఉభయ సభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు.